కాంగ్రెస్ నుండి వచ్చి టీ ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్న కౌశిక్ రెడ్డి కి పార్టీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. దాంతో హుజురాబాద్ టికెట్ ఎవరికి దక్కుతుందో అన్న చర్చ మొదలైంది. మొదట హుజూరాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డి కే వస్తుంది అన్న అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఆయనకు ఎమ్మెల్సీ రావడం తో ఇప్పుడు హుజూరాబాద్ టికెట్ ఎవరిని వరిస్తుందా అనే అనుమానం మొదలైంది.

ముక్యంగా రెడ్డి సామాజిక వర్గానికా లేదంటే బిసి కి దక్కుతుందా అన్నది ఉత్కంఠగా మారింది.  ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఇనుగాల పెద్దిరెడ్డి కి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయి. టిఆర్ఎస్ అధిష్టానం బిసి వైపు మొగ్గు చూపిస్తే టిడిపి నుండి టీ ఆర్ ఎస్ లో చేరిన ఎల్ రమణ కు లేదంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు టికెట్ దక్కే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే బీజేపీ నుండి ఈటల ప్రచారం జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి కారు పార్టీ నుండి టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: