తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముందునుండి తక్కువగానే ఉంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో సెకండ్ ప్రభావం పూర్తిగా అదుపులోకి వచ్చిందని చెప్పవచ్చు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఓ గ్రామంలో పదిమందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో జిల్లా వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. కాగా ఇప్పుడు తాజాగా జగిత్యాల జిల్లాలో అదే పరిస్థితి కనిపిస్తోంది. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంట గ్రామం లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

వారం రోజుల్లోనే చింతకుంట గ్రామం లో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చింతకుంట గ్రామపంచాయతీ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ సంచలన తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది. అయితే కరోనా నిబంధనలను పాటించాలని మాత్రం ప్రభుత్వం సూచించింది. అయినప్పటికీ ప్రజలు మాస్కులు ధరించకుండా సామాజిక పాటించకుండా నిబంధనలను గారికి వదిలేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: