అనంతలో వైసీపీ నేతలు హంగామా సృష్టించిన‌ట్టు తెలుస్తోంది.  ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నదీమ్ అహ్మద్ ఎంపిక‌య్యారు. ఈ సంధ‌ర్బంగా నగరంలో భారీ ర్యాలీ మ‌రియు ఊరేగింపుని నిర్వ‌హించారు. అయితే ఈ ఊరేగింపులో వైసీపీ నేత‌లు హంగామా సృష్టించార‌ని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. న‌గ‌రంలోని ప్రముఖ కూడళ్లలో టపాసులు పేలుస్తూ, డిజే సాంగ్స్ పెట్టి హంగామా చేసిన‌ట్టు చెబుతున్నారు. అయితే ఈ ర్యాలీ మ‌రియు ఊరేగింపుపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్ప‌టికీ కూడా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. 

సెకండ్ వేవ్ ఉధృతి ప్ర‌స్తుతం త‌గ్గుముకం ప‌ట్టినప్ప‌టికీ గ‌తంలో వ‌చ్చిన‌న్ని కేసులు కాక‌పోయినా త‌క్కువ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే ఇలాంటి నేప‌థ్యంలో ర్యాలీ నిర్వ‌హించ‌డం..ఊరేంగిపులు చేయ‌డం ఏంట‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు, దుకాణ‌దారుల‌కు క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే పోలీసులు భారీ జ‌రిమానాలు విధిస్తున్నార‌ని..కానీ క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుండా ర్యాలీలు చేస్తుంటే పోలీసులు పట్టించుకోక‌పోవ‌డంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: