పూరీ జగన్నాథుని దేవాలయంలోకి ఈ నెల 23 నుంచి భక్తులను అనుమతించనున్నారు. కొవిడ్ వల్ల మూడునెలలపాటు మూసేసిన ఆలయాన్ని తాజాగా ఈరోజు తెరిచారు. తొలి దశలో ఆలయ సేవకుల కుటుంబ సభ్యులకు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని అధికారులు వెల్లడించారు. కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ సుప్రసిద్ధ ఆలయాన్ని ఏప్రిల్ 24వ తేదీ నుంచి మూసేసింది. ఆలయ సేవకులకు జారీచేసిన గుర్తింపుకార్డును, అలాగే ప్రభుత్వం జారీచేసిన ఏదైనా గుర్తింపుకార్డును చూపించాలని అధికారులు తెలిపారు. ఆ తర్వాత రెండోదశలో భాగంగా ఈనెల 16వ తేదీ నుంచి పూరీలో నివసించేవారినే ఆలయంలోకి అనుమతిస్తామన్నారు. ఆ తర్వాత 23వ తేదీ నుంచి సాధారణ ప్రజానీకం ఎవరైనా జగన్నాథుడిని దర్శించుకోవచ్చన్నారు. వ్యాక్సిన్ సర్టిఫికెట్‌నుకానీ, ఆర్టీపీసీఆర్ నివేదికకానీ సమర్పించాల్సి ఉంటుందన్నారు. దర్శనానికి 96 గంటల మందు చేయించుకున్న పరీక్ష పత్రాలు ఉండాలని, ఆధార్‌కార్డు కూడా తమ వెంట తీసుకురావాలన్నారు. శనివారం, ఆదివారం ప్రభుత్వ ఆంక్షలు అమల్లో ఉంటాయికాబట్టి ఈ రెండు రోజులు ఆలయాన్ని మూసేయనున్నారు.