దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఎదుట ఇద్ద‌రు వ్య‌క్తులు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న దేశ రాజ‌ధానిలో క‌ల‌క‌లం రేకెత్తించింది. ఒక పురుషుడు, ఒక మ‌హిళ సుప్రీంకోర్టు ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. అక్క‌డున్న స్థానికులు, పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై వారి మంట‌లు ఆర్పేసి చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రూ రామ్‌మ‌నోహ‌న్‌లోహియా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు వారిద్ద‌రూ ఎందుకు పాల్ప‌డ్డార‌నే విష‌యం మాత్రం తెలియ‌లేదు. సంగ‌ట‌న జ‌రిగిన ప్ర‌దేశంలో పోలీసుల‌ను మొహ‌రించిన‌ట్లు ఢిల్లీ పోలీస్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ దీప‌క్‌యాద‌వ్ తెలిపారు. దీనిపై విచార‌ణ చేస్తున్నామ‌ని, వారెవ‌రు, ఎక్క‌డినుంచి వ‌చ్చార‌నే విష‌యం తెలియ‌రాలేద‌ని, చికిత్స నుంచి కోలుకున్న త‌ర్వాత వివ‌రాలు రాబ‌డ‌తామ‌న్నారు. సుప్రీంకోర్టు ఎదుట వీరు ఎందుకు ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డ్డార‌నే విష‌య‌మై ఇంత‌వ‌ర‌కు స్ప‌ష్ట‌త రాలేదు. దీనిపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌ర‌ప‌మ‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ పోలీసుల‌ను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: