సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో ఈరోజు పైలెట్ ప్రాజెక్టుగా దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ సభకు మంత్రి గంగుల కమలాకర్ కూడా హాజరయ్యారు. ఈ సభకు వెళ్లి తిరిగి వస్తున్న మంత్రి గంగుల కమలాకర్ వాహనాన్ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. జై ఈటెల జై జై ఈటెల అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ పాలన వద్దంటూ ఈటల మద్దతుదారులు నినాదాలు చేశారు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.

అయితే ఆ సమయంలో ఓ కార్యకర్త కిందపడిపోయారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ఈటల టీ ఆర్ ఎస్ లో  ఉన్న సమయంలో ఎంతో స్నేహంగా ఉన్న గంగుల కమలాకర్ ఈటల ఇప్పుడు గంగుల కమలాకర్ వర్సెస్ ఈటల రాజేందర్ అన్న  విధంగా మారిన సంగతి తెలిసిందే. ఈటల గంగుల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గంగుల కమలాకర్ ను ఈటెల రాజేందర్ మద్దతుదారులు అడ్డుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: