తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. చిన్న పిల్లలను పట్టుకొని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కుటుంబం తో సహా ఇతర దేశాలకు పారిపోతున్నాయి. ఇక సోమవారం నాడు కాబూల్ విమానాశ్రయానికి కి భారీగా ప్రజలు చేరుకున్న సంగతి తెలిసిందే. విమానాల వెంట పరిగెత్తుకుంటూ వెళ్లి నానా అవస్థలు పడ్డారు. విమానం చక్రాలను పట్టుకుని ఒక ముగ్గురు గాల్లో నుంచి కింద పడి ప్రాణాలు కూడా కోల్పోయారు.
విమానం లో చోటు దొరికినా బస్సుల్లో ఎక్కిన విధంగా ఎక్కి ప్రయాణించారు. ఇక విమానాశ్రయం లో మరికొందరిని తాలిబన్లు కాల్చిచంపారు. అయితే మంగళవారం విమానాలను నడపడం లేదని ప్రకటించినప్పటికీ ప్రజలు లోపలికి వచ్చారు. ఇక ప్రజలు భారీగా తరలిరావడంతో విమానాశ్రయం అంతా చిందర మందర గా మారింది. అంతే కాకుండా విమానాశ్రయం లోని వస్తువులన్నీ ద్వంసం అయ్యాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: