బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మళ్లీ సూపర్ డాన్సర్ షూటింగ్ సెట్స్ లో సందడి చేసింది. రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన నాటి నుండి శిల్పాశెట్టి షూటింగులకు దూరంగా ఉంది. పోర్న్ వీడియోల కేసులో రాజ్ కుంద్రా జూలై లో అరెస్టయ్యారు. అప్పటి నుండి శిల్పాశెట్టి సూపర్ డ్యాన్సర్ షూటింగ్ లో పాల్గొనలేదు. మరోవైపు శిల్పాశెట్టి కూడా పోర్న్ వీడియోల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే పోలీసుల విచారణలో శిల్పాశెట్టి పేరు ఎక్కడ బయటకు రాలేదు.

ఇక ఎట్టకేలకు శిల్పశెట్టి మళ్లీ షూటింగ్ లో పాల్గొనడం తో ఆమె అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రస్తుతం శిల్పా శెట్టి షూటింగ్ కు వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో లో శిల్పా శెట్టి క్యారవ్యాన్ నుండి దిగి నడుచుకుంటూ వెళుతూ కెమెరాలకు హాయ్ చెప్పింది. వీడియో లో శిల్ప శెట్టి ఎమోషనల్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా బుధవారం రాజ్ కుంద్రా కు బయలు దొరికినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శిల్పాశెట్టి మళ్లీ షూటింగులో జాయిన్ అయ్యిందని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: