నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన వైసిపి కౌన్సిలర్ వెంకట సురేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. సురేష్ దగ్గర పని చేసిన బాలు అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు గుర్తించి అరెస్టు చేశారు. బాలు 2019 నుండి సురేష్ దగ్గర పని చేస్తున్నాడు. కాగా ఆర్థిక లావాదేవీల విషయంలోనే సురేష్ ను బాలు హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. కొంతకాలం క్రితం కౌన్సిలర్ వెంకట సురేష్ తన వద్ద పనిచేస్తున్న బాలు పేరు మీద ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అయితే ఇప్పుడు ఆ ఫ్లాట్ ను సురేష్ అమ్మాలని అనుకున్నాడు.

దాంతో బాలు తనకు కూడా వాటా కావాలని కోరాడు. అయితే కౌన్సిలర్ సురేష్ మాత్రం అందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో సురేష్ ను హత్య చేస్తే ఫ్లాట్ పూర్తిగా తన వశం అవుతుందని పథకం రచించిన బాలు.. ఈనెల 9న కత్తితో సురేష్ పై దాడి చేసి హతమార్చాడు. సోమవారం తన పుట్టినరోజు కావడంతో సురేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దేవస్థానం కి వెళ్ళాడు. ఉదయం దర్శనం చేసుకుని సాయంత్రం నూల్లురుపేటకు చేరుకున్నాడు. అయితే కార్ పార్క్ చేస్తానని వెళ్లిన వెంకట సురేష్ ను బాలు పార్కింగ్ షెడ్ లోనే హత్య చేసి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నింధితున్ని అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: