రాజ‌మండ్రిలోని గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇంటికి టీడీపీ హైకమాండ్ బృందం చేరుకుంది. ఆయ‌న ఇంటికి వెళ్లిన‌వారిలో నిమ్మకాయల చినరాజప్ప,  జవహర్, గద్దె రామ్మోహన్‍ లు ఉన్నారు. బుచ్చయ్య చౌదరి ఇంట్లో త్రిసభ్య బృందం భేటీ అవ్వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌స్తుతం వీరు బుచ్చ‌య్య చౌద‌రిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. రాజీనామా చేసే ఆలోచ‌న‌లో ఉన్న బుచ్చ‌య్య చౌద‌రి క‌మిటీతో మీటింగ్ త‌ర‌వాత ఎలాంటి నిర్న‌యం తీసుకుంటారు..మ‌న‌సు మార్చుకుంటారా..? లేదా.? అన్న ఆస‌క్తి నెల‌కొంది. 

ఇక ఇప్ప‌టికే టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా బుచ్చ‌య్య చౌద‌రికి ఫోన్ చేసి బుజ్జంగిచే ప్ర‌యత్నం చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి బుచ్చ‌య్య చౌద‌రి త్రిస‌భ్య క‌మిటీ బుజ్జంగిపుల‌కు అయినా లొంగుతారో లేదో చూడాలి. ఈ స‌మావేశం నేప‌థ్యంలో గోరంట్ల నివాసానికి  పెద్ద సంఖ్యలో ఆయ‌న అనుచ‌రులు కూడా చేరుకున్నారు. దాంతో త‌య‌న ఇంటి వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: