వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి టీడీపీ అధినేత‌ను టార్గెట్ చేస్తూ మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణలు చేశారు. విజ‌య‌సాయి రెడ్డి త‌న ట్విట్ట‌ర్ లో సైరా పంచ్ అంటూ చంద్రబాబు ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఫోటోలో చంద్ర‌బాబు ఎన్టీఆర్ వెన‌కాల నిలుచుని వెన్నుపోటు పొడుస్తున్న‌ట్టు ఎడిట్ చేశారు. ఇక ఈ ఫోటోకు ఆగస్టు 23 అంత‌ర్జాతీయ వెన్నుపోటు దినోత్సవం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు. 23-08-1995 ఎన్టీఆర్ సీఎం కుర్చీని లాక్కుని పార్టీ నుండి బ‌హిష్క‌రించారంటూ పేర్కొన్నారు. 

అంతే కాకుండా విజ‌యసాయి టీడీపీ మంత్రుల‌పై కూడా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దేశంలో మహిళలపై అరాచకాలకు పాల్పడిన ఐదుగురు మంత్రుల్లో బాబు కేబినెట్ లోని అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ కూడా ఉన్నారని అప్పట్లో మీడియాలో ప్రముఖంగా వచ్చిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మహిళలు ఇల్లు దాటి బయటకు రావద్దని, కారు షెడ్ లో ఉన్నంత వరకే రక్షణ ఉంటుందని ఉపదేశించింది అప్పటి స్పీకర్ కోడెల కాదా? అంటూ విజ‌య సాయి రెడ్డి ప్ర‌శ్నించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: