కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డితో ప్ర‌జాగాయ‌కుడు గ‌ద్ద‌ర్ భేటీ అయ్యారు. గ‌ద్ద‌ర్ త‌న‌పై దేశవ్యాప్తంగా ఉన్న కేసుల‌ను కొట్టివేయాల‌ని ఈ సంధ‌ర్భంగా కిషన్ రెడ్డిని కోరారు. అంతే కాకుండా  ఈ కేసుల వ్య‌వ‌హారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను క‌లిసే అవ‌కాశం క‌ల్పించాల‌ని గ‌ద్ద‌ర్ కిష‌న్ రెడ్డికి విన్న‌వించుకున్నారు. ప్ర‌భుత్వం పిలుపు మేర‌కు తాను 1990లో న‌క్స‌లిజం ను వదిలి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిసాన‌ని గ‌ద్ద‌ర్ పేర్కొన్నారు. ఆ త‌ర‌వాత 1997లో త‌న‌పై దాడి జ‌రిగింద‌ని తెలిపారు. 

ఆ స‌మ‌యంలో త‌న వెన్నుపూస‌లో ఓ బులెట్ ఉండిపోయింద‌ని...అది ఇప్ప‌టికీ ఇబ్బంది పెడుతూనే ఉంద‌ని చెప్పారు. ఆ బుల్లెట్ కారణంగా అనేక అనారోగ్య సమ‌స్య‌లు వచ్చాయ‌ని గ‌ద్ద‌ర్ పేర్కొన్నారు. ఆ స‌మ‌యంలో తాను మ‌ళ్లీ పారిపోయాన‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయ‌ని గ‌ద్ద‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో గ‌ద్ద‌ర్ కేసుల నుండి విడిపించేలా కేసీఆర్ ను సైతం న్యాయ స‌హాయం కోరారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: