జీవో 111 పై మరో మారు తెలంగాణ హై కోర్టులో విచారణ జ‌రిగింది. ప్రభుత్వం తీరు పై హైరోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 'నివేదిక జాప్యం వెనక రహస్య ఎజెండా ఏంటని సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ప్ర‌శ్నించింది. నాలుగేళ్లు దాటినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నివేదిక జాప్యం వెనక రహస్య ఎజెండా ఏమిటని ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించింది. కరోనా, తదితర కారణాల వల్ల ఆలస్యమైందని అదనపు ఏజీ రామచంద్రరావు కోర్టుకు తెలిపారు. దాంతో ఉన్నత స్థాయి కమిటీ సెప్టెంబర్ 13లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దు చేస్తామని హైకోర్టు మండిప‌డింది.
ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలపాలని హైకోర్టు కమిటీకి ఆదేశాలు ఇచ్చింది. అంతే కాకుండా నివేదికను వెబ్ సైట్ లో పెట్టాలని కమిటీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కమిటీ నివేదికపై సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇక తదుపరి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది. ఇదిలా ఉండ‌గా ఉమ్మ‌డి రాష్ట్రంలో జీవో 111ను ప్ర‌భుత్వం ఇచ్చింది. ఉస్మాన్ సాగ‌ర్, హిమాయ‌త్ సాగ‌ర్ పరిర‌క్ష‌ణ కోసం ఈ జీవోను అప్ప‌టి ప్ర‌భుత్వం ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: