తెలంగాణాలో కొందరు మాజీ మంత్రులు తెరాస అధిష్టానంపై సీరియస్ గా ఉన్నారనే కామెంట్స్ మనకు ఎక్కువగా వినపడుతున్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కడియం శ్రీహరి ఈ మధ్య కాలంలో కాస్త పార్టీ అధిష్టానం పై అసహనంగా ఉండి దూరంగా ఉన్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. స్టేషన్ ఘనపూర్ లో కార్యకర్తల సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ...

ఈమధ్య కాలంలో నాపై కొందరు దుష్ప్రచారం చేశారు అని అసహనం వ్యక్తం చేసారు. కష్టపడే వారికి కేసీఆర్ గౌరవం ఇస్తారు అన్నారు. దళితబంధు రివ్యూకు వరంగల్ నుంచి కేవలం నన్ను మాత్రమే ఆహ్వానించారు  అని పేర్కొన్నారు. పనిచేసే వాళ్లెవరో, పైసలు తీసుకునే వారెవరో ప్రజలకు తెలుసు అన్నారు ఆయన. విభేదాలు లేకుండా పార్టీ కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దాం అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: