బాల‌వుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ హిందీ భాషల‌లో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే త‌లైవి సినిమా టీజ‌ర్,ట్రైల‌ర్ ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ సినిమాకు సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ  నేపథ్యంలో నేడు కంగ‌నా ర‌నౌత్ చెన్నై మెరీనా బీచ్ లో ఉన్న జ‌య‌ల‌లిత స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లి ఆమెకు నివాళ్లు అర్పించారు. 

అంతే కాకుండా జ‌య‌ల‌లిత గెట‌ప్ లో కంగనా చీర క‌ట్టులో పెద్ద బొట్టుతో వెళ్లి నివాళ్లు అర్పించ‌డం విశేషం. ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత గెటప్ లో కంగ‌నా సమాధి వ‌ద్ద నివాళ్లు అర్పిస్తున్న ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. దాంతో జ‌య‌ల‌లిత అభిమానులు కంగ‌నా అభిమానులు కుషీ అవుతున్నారు. ఇక ఎన్నో అంచ‌నాలు ఉన్న త‌లైవీ ఎలాంటి విజ‌యం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: