బిగ్ బాస్ సీజ‌న్ -5 లో  ప‌దిహేడ‌వ కంటెస్టెంట్ గా ఆర్ జే కాజ‌ల్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ఆర్ జేల‌లో కాజ‌ల్ ఎంత పాపులారిటీ సంపాదించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. త‌న గొంతుతో శ్రోత‌ల‌ను క‌ట్టిప‌డేసే కాజల్ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కూడా ఉన్నాయి. వాటిని బిగ్ బాస్ ఎంట్రీ సంధ‌ర్భంగా కాజ‌ల్ ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు. తాను ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్టేజ్ కి వ‌చ్చాన‌ని ప్రేమ వివాహం చేసుకున్నాన‌ని కాజ‌ల్ తెలిపారు. 

త‌న‌కు ఓ కూతురు ఉంద‌ని కాజ‌ల్ అంద‌ర్నీ షాక్ కు గురిచేశారు. చూడ్డానికి చాలా యంగ్ గా క‌నిపించే కాజ‌ల్ కూతురును చూసి అంతా అవాక్క‌య్యారు. ఇక నాగార్జున తో త‌న ఫ‌స్ట్ ఇంట‌ర్యూ చేసాన‌ని కాజ‌ల్ తెలిపారు. అంతే కాకుండా కాజల్ టైటిల్ గెలిచి తీర‌తాన‌ని దీమా వ్య‌క్తం చేశారు. ఇక గ‌డ గ‌డా మాట్లాడుతూ శ్రోత‌ల‌ను క‌ట్టిప‌డేసే ఆర్జే కాజ‌ల్ హౌస్ లో ఏ మేర‌కు వినోదాన్ని పంచుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: