దళిత విభాగం ఏర్పాటుతో వైఎస్సార్టీపీలో తొలిసారి పదవీ పంపకం అధికారికంగా మొదలైందని చెప్పవచ్చు. ఈ విభాగం ఇకపై పార్టీ ఆశలకూ, ఆశయాలకూ అనుగుణంగా పనిచేయనుందని వైఎస్సార్టీపీ విశ్వసిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొన్ని పాటలకూ రూప కల్పన చేయనున్నారు గాయకులు ఏపూరి..ఏదేమైనప్పటికీ పార్టీని వీడే నేతలను పట్టించుకోకుండా, పార్టీ పటిష్టతకు ప్రాధాన్యం ఇస్తున్న నేతలతో కలిసి మున్ముందు పనిచేయాలన్న సంక ల్పంలో భాగంగా వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పనిచేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇవాళ దళిత విభాగాన్ని ఎనౌన్స్ చేశారు.
గాయకుడు ఏపూరి సోమన నేతృత్వంలో ఇకపై దళిత విభాగం పనిచేయనుంది అని, ఈయనతో పాటు మరో 11 మంది కార్యవర్గం పనిచేయనుందని షర్మిల ప్రకటించారు. వీరంతా కో కన్వీనర్లుగా ఉంటారని ఆమె తెలిపారు. మరోవైపు దళితుల ఐక్యతే ధ్యే యంగా తాను పనిచేస్తానని పేర్కొంటూ ఇవాళ మంద కృష్ణ మాదిగ ను పరామర్శించిన క్రమంలో మరో మారు చెప్పారు. అంతేకా కుండా పార్టీ బలోపేతానికి దళిత, గిరిజనుల సహకారం తీసుకుని తెలంగాణ వాకిట రాజన్న రాజ్యం తెస్తానని పునరుద్ఘాటన చేశారు.