రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని సైబరాబాద్ కమీషనర్ రేట్ కు కూతవేటు దూరంలోనే ఉన్న సెంట్రల్ బ్యాంక్ లో దుండగులు చోరీకి ప్ర‌య‌త్నించారు. కిటికీ గ్రిల్స్ ను తొలగించి దొంగలు లోప‌లికి ప్ర‌య‌త్నించే ప్ర‌య‌త్నం చేశారు. సీసీ కెమెరాల కేబుల్ కట్ చేసి స్ట్రాంగ్ రూమ్ తలుపులు తెరిచేందుకు దుండ‌గులు విఫలయత్నం చేశారు. అయితే అది ఎంతకీ తెరుచుకోకపోవడంతో చేసేది లేక బ్యాంక్ లో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్, ఇతర సామగ్రిని దొంగ‌లించారు. 

కాగా ఉదయం బ్యాంక్ తెరిచిన సిబ్బంది విషయం గమనించి రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం లను, డాగ్ స్క్వార్డ్ ను పోలీసులు రంగంలోకి దింపి ద‌ర్యాప్తు జ‌రుతున్నారు. చోరికి య‌త్నించిన వారిలో ఓ పురుషుడు, ఓ మహిళ మరి కొందరు వీరికి సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా క‌మీష‌న‌రేట్ కు ద‌గ్గ‌ర‌లో దుండ‌గులు బ్యాంక్ చోరీకి య‌త్నించ‌డం క‌ల‌కలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: