కేరళలో నిఫా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో పూర్తిస్థాయిలో అప్రమత్తత పాటించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అధికారులకు సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. వైరస్‌పై ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోందని, సరిహద్దు జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులను కూడా అలెర్ట్ చేశామని వెల్లడించారు. ఇప్పటివరకు నిఫా కేసులేవీ లేకపోయినా నిర్లక్ష్యం కూడదని ప్రజలకు సూచించారు. బెంగళూరు నగర ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు శాటిలైట్ రింగ్‌రోడ్ల పథకాన్నిచేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర భూ ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరితో భేటీ సందర్భంగా ఈ విషయంపై చర్చించినట్లు తెలిపారు. శాటిలైట్ రింగ్‌రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూముల స్వాధీనం కోసం రూ.1560 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో 30శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల మరమ్మత్తులకు రూ.184.85 కోట్లను విడుదల చేయాలని కోరగా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని బొమ్మై వివరించారు.