వినాయక నిమజ్జనం రివ్యూ పిటిషన్ పై తెలంగాణా హైకోర్ట్ లో కాసేపటి క్రితం విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్ట్ షాక్ ఇచ్చింది. గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందే అని కోర్ట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ ఆదేశాలపై అభ్యంతరాలుంటే ఉత్తర్వులను ఛాలెంజ్ చేసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఒక్క ఏడాది మినహయింపు ఇవ్వాలని ప్రభుత్వం కోరింది.

గత ఏడాది లోనూ నిమజ్జనం పై ఉత్తర్వులు ఇచ్చినా, ఏడాది గడిచినా పాటించలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. పొల్యూషన్ ను నియంత్రణ చేయాల్సిన ప్రభుత్వమే సహకరించాలని హైకోర్టు ను కోరడం పై ఆశ్చర్యం వ్యక్తం వ్యక్తం చేసింది కోర్ట్. కాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: