భారతీయ జనతాపార్టీ, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఇద్దరూ ఒకటేనని, బీజేపీకి ఒవైసీ చాచా జాన్ అవుతారని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ విమర్శించారు. ఆ రెండు పార్టీల చర్యలను రైతులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు. బాగ్‌పట్‌లో ఆయన మాట్లాడుతూ ఒవైసీకి బీజేపీ ఆశీస్సులు దండిగా ఉన్నాయని, ఆయన బీజేపీని తిట్టిపోస్తుంటారని, అయినా ఆయనపై ఒక్క కేసు కూడా బీజేపీ పెట్టదన్నారు. బీజేపీ ఆయన సాయం తీసుకుంటోందని, రైతులు ఆ రెండు పార్టీలు, ఆ రెండు పార్టీల నేతల చర్యలను అర్థం చేసుకోవాలని కోరారు. ఒవైసీ రెండు ముఖాలున్న మనిషని, ఎన్నికల కోసం కుట్రలు పన్నుతుంటారని, బీజేపీ గెలవడం కోసం తమ అభ్యర్థులను పోటీలో నిలబెడుతుంటారన్నారు. రైతుల డిమాండ్లను అంగీకరించి, మూడు సాగు చట్టాలను కేంద్రం రద్దు చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుంటుందని స్పష్టం చేశారు. అప్పటివరకు తాము ఢిల్లీ సరిహద్దులు వీడమన్నారు. తుదిశ్వాస వరకు పోరాటం సాగిస్తామని, ఎంత సమయం పట్టినా వెనకంజ వేయమన్నారు.