జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిప‌బ్లిక్ సినిమా ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మాట్లాడుతూ....ఆరేళ్ళ చిన్నారి అమానుషంగా హత్యకు గురైందని ఆయన ఆరోపించారు. సినీ పరిశ్రమకు ఇబ్బందులు కలిగిస్తే తాట తీస్తా అని ప‌వ‌న్ హెచ్చరించారు. అంతే కాకుండా వైసీపీ నేతలకు పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ లో ఉన్నది వైసిపి అని రిపబ్లిక్ కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప‌వ‌న్ ప్రశ్నించారు. వైసిపి నాయకులు చెప్పేదొకటి చేసేదొకటి అంటూ పవన్ క‌ల్యాణ్ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. 

ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కోడి కత్తితో పొడిచిన నాయకుడి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆ కేసు గురించి ఏమైంది అని ఆయన ప్రశ్నించారు. వైసిపి సానుభూతిపరులు వ్యభిచారానికి మద్దతు పలికారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. టిడిపి అన్నప్పుడు కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడిన వైసిపి నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. తన పేరు చెప్పి సినిమా ఇండస్ట్రీ ఇబ్బంది పెట్టొద్దు అని ప‌వ‌న్ హెచ్చ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: