దుర్గగుడి ఫ్లైఓవర్ పై యువకులు చేసిన విన్యాసాల పై ఎసిపి హనుమంతరావు స్పందిచారు. ఏప్రిల్ నెలలో ఈ రేసింగ్ ఘటన జరిగిందని ఏసీపీ స్పష్టం చేశారు. విన్యాసాలు చేసిన వారిని గుర్తించి చర్యలు కూడా తీసుకున్నామని చెప్పారు. విన్యాసాలు పాల్పడిన వ్యక్తి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి, వారిని హెచ్చరించామని తెలిపారు. సీపీ గారి ఆదేశాలతో విశాలమైన రహదారుల పై గస్తీ ముమ్మరం చేశామని ఏసీపీ వెల్లడించారు. ఇలాంటి రేసింగ్ లకు పాల్పడితే చర్యలు తప్పవని ఏసీపీ వార్నింగ్ ఇచ్చారు.
విద్యార్థులు అనవసరంగా భవిష్యత్తు ను మరియు జీవితాలను నాశనం చేసుకోవద్దని ఏసీపీ అన్నారు.
తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు పై ఖచ్చితంగా దృష్టి పెట్టాలని ఏసీపీ తెలిపారు. ఘటన జరిగాక బాధ పటడం కంటే... ముందే చర్యలు తీసుకోవడం మేలని తెలిపారు. కౌన్సిలింగ్ తరవాత కూడా రేసింగ్ లకు వెళుతూ పట్టుబడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.
మరింత సమాచారం తెలుసుకోండి: