నన్ను హౌస్ అరెస్ట్ చేశారు

'కాశ్మీర్ లో పరిస్తితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రపంచానికి తెలుస్తోంది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. సైనికులు దోచుకుంటున్నారు' . ఈ మాటలు  అన్నది  వేరెవరో కాదు,  జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి. కాశ్మీర్ పరిస్థితులపై ఆమె సామాజిక మాధ్యమాలలో తన ఆవెదనను వ్యక్తం చేశారు. పీపుల్ డెమాక్రటిక్ పార్టీ (పిడిపి) తనను గృహ నిర్బంధంలో ఉంచారని తెలిపారు పుల్వామా జిల్లాలో ని తన స్వంత ఊరు త్రాళ్ ను సైనికులు చుట్టుముట్టి దోచుకుతింటున్నారని ఆమె ఆరోపీంచారు. తాను స్వగ్రామం సందర్శించాలని బయలు దేరితే తనను గృహనిర్భంధంలో ఉంచారని ఆమె వివరించారు. నానాటికీ సైనికుల ఆగడాలు మితిమీరి పోతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీరీ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. యగ్వానీ క్యాంపు చెందిన సైనిక పటాలం  తన గ్రామాన్ని చుట్టుముట్టిందని చెప్పారు. సైనికులు  అక్కడి మహిళలపై విచక్షణా రహితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సైనుకుల చర్యల మూలంగా ఎంతో మంది మహిళలు గాయపడ్డారని మెహబూబా ఆవేదన వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: