తెలంగాణ‌ మంత్రి తన్నీరు హరీష్ రావు హుజురాబాద్ పైనే ఫుల్ ఫోక‌స్ పెట్టారు. ప్ర‌తిరోజూ హ‌రీష్ రావు హుజురాబాద్ లో ప‌ర్యటిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ఈ రోజు హ‌రీష్ రావు మాట్లాడుతూ...రైతు బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సాలపల్లిలో ప్రారంభించారని చెప్పారు.
ఈటెల రాజేందర్ ను కేసీఆర్ తమ్ముడిలా భావించారని...అలాంటి కేసీఆర్ కు ఘోరీ కడుతా అని ఈటెల మాట్లాడుతున్నాడంటూ హ‌రీష్ రావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ లేకుండా ఈటెలకు ఈ స్థాయి వచ్చేదా..? అంటూ హ‌రీష్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  


అగ్ర వర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించామ‌ని హ‌రీష్ రావు గుర్తు చేశారు. ఈటెల మాటలు సత్యహరి చంద్రుడి లా ఉంటాయని కానీ చేతలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటాయని హ‌రీష్ రావు మండి ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా ఉప ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో టీఆర్ఎస్ బీజేపీ నేత‌లు దూకుడు పెంచుతున్నారు. కాంగ్రెస్ కూడా త‌మ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేందుకు రెడీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: