ఓ యువతిని ప్రేమించి వివాహం చేసుకుంటా అని మోసం చేసిన కేసులో టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన వరంగల్ లో చోటు చేసుకుంది. వరంగల్ టీ ఆర్ ఎస్ కార్పొరేటర్ తేజస్విని భర్త శిరీష్ తనను మోసం చేశాడు అంటూ బాధితురాలు పోలీసులని ఆశ్రయించింది. ప్రేమిస్తున్న అంటూ శిరీష్ వెంట పడ్డాడని అంతే కాకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడని అతడి మాటలు నమ్మి మోసపోయాను అను ఆవేదన వ్యక్తం చేస్తోంది.

తన వద్ద నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారం లో లాభాలు వస్తాయని 90 లక్షలు కూడా తీసుకున్నాడని యువతి ఫిర్యాదు చేసింది. సదరు యువతి అండర్ రైల్వే గేట్ వద్ద నివాసం ఉంటుందని తెలుస్తోంది. ఇక బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న రాత్రి శిరీష్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి తండ్రి బడా లిక్కర్ వ్యాపారి అని తెలుస్తోంది. కేసు నుండి కుమారుణ్ణి తప్పించాలని చూసిన లిక్కర్ డాన్ సుధాకర్ పై కూడా కేసు నమోదు చేసుకుని గాలించడం ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: