ఏపీలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల కు వైసీపీ పార్టీ రంగులు వేస్తున్నారంటూ జై భీమ్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో పిటిషన్ తరఫున లాయర్ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.. దాంతో వెంటనే పార్టీ రంగులను తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని గత నెలలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాలను అనుసరించి జగన్ సర్కార్ హైకోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది.

చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పై గల పార్టీ రంగులను తొలగిస్తున్నట్టు హైకోర్టులో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది. అంతే కాకుండా భవిష్యత్తులో ప్రభుత్వ భవనాలకు కూడా పార్టీ రంగులు వేయబోమని  పంచాయితీరాజ్ మున్సిపల్ సెక్రెటరీ ద్వివేది హైకోర్టులో ప్రమాణ పత్రాన్ని అందజేశారు. ఇదిలా ఉండగా గతం లో ఏపిలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు పార్టీ రంగులు వేయడం హాట్ టాపిక్ గా మారగా ఎన్నో విమర్శలు వచ్చాయి. దాంతో ఇప్పుడు ఏపి సర్కారు వెనకడుగు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: