హైదరాబాద్ లో ఐటి దాడుల వ్యవహారం సంచలనం అవుతుంది. హెటిరో డ్రగ్స్ లో సోదాలు ఇప్పుడు సంచలనంగా మారింది. మోతి నగర్ రాగ రెసిడెన్షిలో హెటిరో డ్రగ్స్ కు సంబంధించిన నగదు గుర్తించారు. సుమారు 200 వందల కోట్ల మేర నగదు గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. కౌంటింగ్ మిషన్ల ద్వారా నగదు లెక్కింపు పూర్తి చేసిన అధికారులు... నగదు ను లెక్కగట్టి రాగ రెసిడెన్షి నుండి కోఠి ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ కు తరలించారు.

నగదు తరలించడం కోసం ఆరు ఇన్నోవా వాహనాలను సిద్ధం చేసిన ఐటీ అధికారులు... ఇప్పటికే రెండు వాహనాల్లో నగదును కోఠి ఎస్బిఐ మెయిన్ బ్రాంచ్ కు తరలించారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ నగదు తరలించారు అధికారులు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి అని తెలుస్తుంది. పలువురి ఇళ్ళల్లో కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts