బీజేపీ ఎంపీ జీవీల్ మాట్లాడుతూ...గుంటూరు రైల్వే డివిసోన్ పై సమీక్ష సమావేశం నిర్వహించామని చెప్పారు. గుంటూరు జిల్లాలో ప్రధాన సమస్యల పై కలెక్టర్ తో చర్చించామని జివీఎల్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కృషి విద్యాన కేంద్రం పల్నాడులో ఏర్పాటు చేస్తామన్నారు. 25 బెడ్లతో ఈ ఎస్ ఇ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేశామని జీవీఎల్ చెప్పారు. నీరు సరిగా లేక జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవీ ఎల్ వ్యాఖ్యానించారు. బుగ్గవాగు రిజర్వాయర్ కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని జీ వీ ఎల్ హామీ ఇచ్చారు.

రాజకీయాలకు అతీతంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జీ వీ ఎల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి అన్ని పక్కాగా అమలు జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ట్రైబల్ ప్రజలు గుంటూరు జిల్లాలో ఎక్కువుగా వున్నారని...వారికి పూర్తి అవసరాలు పాఠశాలలు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని చెప్పారు. నేషనల్ హైవే పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని...గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రాజకీయాల పై దృష్టి పెట్టి అభివృది ని పక్కన పెట్టారంటూ జీవియల్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: