మాజీహోం మంత్రి పై సిబి 'ఐ'

మహా రాష్ట్ర మాజీ హోం మంత్రి అనీల్ దేశ్ ముఖ్ పై సి.బి.ఐ దృష్టి సారించింది. ఆయన నివాసంతో పాటు, ముంబై, నాగపూర్ లతో పాటు పలు ప్రాంతాలలో దాడులు నిర్వహిస్తన్నట్లు సి.బి.ఐ అధికారులు స్వయంగా ప్రకటించారు. ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్నదీ తెలిపేందుకు అధికారులు సముఖత వ్యక్తం చేయలేదు. ఆదాయానికి మించిన ఆస్తులు, తాను హోం మంత్రి గా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్లు అనీల్ దేశ్ ముఖ్ పై ఆరోపణలున్నాయి. ముంబై నగర పోలీస్ కమిషనర్ గా ప్రేమ్ బిర్ సింగ్ ను తోలగించిన తరువాత ఈ మాజీ మంత్రి పై ఆరోపణలు వెల్లువెత్తాయి.
  అనీల్ దేశ్ ముఖ్ 1995-99 వరకూ మహారాష్ట్ర విద్యాశాఖ సహాయ మంత్రి గా పనిచేశారు. 1999-2001 వరకూ యువజన సర్వీసుల శాఖ మంత్రి గా పని చేశారు. 2001-04  మధ్యకాలంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. 2004-08 వరకూ కూడా పబ్లిక్ వర్క్ మంత్రిగా  పనిచేశారు. ఆ తరవాత చాలా కాలం అమాత్య పదవికి దూరంగా ఉన్నారు. తరవాత ఈయన కు 2019లో  అమాత్య పదవి దక్కింది.
2019-21 వరకూ   హోం మంత్రి పదవి లో కొనసాగారు. ఇ దేే సంవత్సరం అనీల్ దేశ్ ముఖ్ పై ఆరోపణలు వెల్లవెత్తాయి. ముంబై నగరంలోని లో బార్ల నుంచి నెలకు నాలుగు కోట్లు రూపాయలకు పైగా లంచం తీసుకుంటున్నారంటూ నగర పోలీస్ కమీషనర్ ఆరోపణలు చేశారు. దీంతో ఈయన పై సి.బి.ఐ దృష్టి సారించింది. తాజాగా అరెస్ట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbi