మూవీ ఆర్టిస్టు అసోసియేష‌న్ ఎన్నిక‌ల త‌రువాత మ‌రిన్ని కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. చాలా రోజుల త‌రువాత మ‌రో తెలుగు న‌టీ న‌టుల సంఘం ఏర్పాటు కానుంది. ఇందుకు ప్ర‌కాశ్ రాజ్ సార‌థ్యం వ‌హించ‌నున్నారు. ఏటీఎం పేరిట ఇది రానుం ది. అసోసియేష‌న్ ఆఫ్ తెలుగు మూవీ (ఏటీఎం) పేరిట ఈ సంఘం ఏర్పాటుకు స‌న్నాహాలు పూర్త‌య్యాయి. ఇప్ప‌టికే ప్ర‌కాశ్ రాజ్ త‌ర‌ఫున గెలిచిన వారంతా రాజీనామాలు చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించి, సంచ‌లనం అయ్యారు. అదేవిధంగా మెగా కుటుంబం నుంచి కూ డా ఈ ఎన్నిక‌కు సంబంధించి అనేక అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎన్నిక‌లు నిర్వ‌హించిన సంద‌ర్భంలో అనేక వివాదాలు న‌మోదు కావ‌డం, మోహ‌న్ బాబు ప‌లు వ్యాఖ్య‌లు చేయ‌డం త‌మ‌ను బాధ‌పెట్టాయని ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ త‌ర‌ఫున ఎన్నికయిన వారంతా క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. హైద్రాబాద్ లో ఇవాళ నిర్వ‌హించిన ప్రెస్మీట్ లో ప‌లువురు స‌భ్యులు భావోద్వేగానికి లోన య్యారు. బెన‌ర్జీ, ఉత్తేజ్, త‌నీష్ ఇలా అంతా క‌న్నీటి ప‌ర్యంతం అయి త‌మ భావోద్వేగాల‌ను వెల్ల‌డి చేశారు. ఇలాంటి ప‌రిణామాల్లో తాము ప‌నిచేయ‌లేమ‌ని ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్ స‌భ్యులు ఆవేద‌న చెందుతూ చెప్పారు. ఇవే ఇప్పుడు కొత్త సంఘానికి ఏర్పాటు అ య్యేందుకు ప్ర‌ధాన కార‌ణం అయింది. ఇప్పుడు ప్రారంభం కానున్న ఈ సంఘం రేప‌టి వేళ ఎన్ని సంచల‌నాల‌కు వేదిక కానుందో అన్న ఉత్కంఠ‌త రేగుతోంది. చిరు కుటుంబం మొత్తం ఈ సంఘం వెంటే ఉండ‌నుంద‌న్నది మాత్రం ఓ వాస్త‌వం. నాగ‌బాబుతో స‌హా ఇత‌ర మెగా హీరోలు అంతా ప్ర‌కాశ్ రాజ్ తో ప‌నిచేయించేందుకు స‌మాయత్తం అవుతున్నార‌న్న‌ది ప్రాథ‌మిక స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa