నగరంలో భారీగా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ నగర ప్రజలను హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు తమ తమ పరిధిలో నిలిచిపోయిన వరద నీటిని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను మేయర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా జిహెచ్ఎంసి కాల్ సెంటర్ 040 21111111 ఫిర్యాదు చేయాలని మేయర్ నగర ప్రజలకు సూచించారు.

అదే విధంగా కంట్రోల్ రూమ్ లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని.... అన్ని విభాగాల అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మేయర్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది..కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవ్వడం తో పాటు ట్రాఫిక్ జామ్ సమస్య తో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: