గుజరాత్ రాష్ట్రం సూరత్ సమీపంలో కడోదర వద్ద ఉన్న పరిశ్రమలో కొద్ది సేపటి క్రితం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం అగ్నీ కీలలకు ఆహుతై ఒకరు మరణించారు. ప్రమాదం నుంచి బైట పడే నిమిత్తం జరిగిన ప్రయత్నాలలో ఇద్దరు మరణించారు.
కడోదన పారిశ్రామిక వాడలో సోమవారం పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీ ప్యాకేజింగ్ యూనిట్ లోని ఐదవ అంతస్తులో కార్మికులు పని చేస్తుండగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటల్లో ఒకరు అక్కడికక్కడే మరణించారు. కార్మికులు భయాందోళనలతో వెలుపలికి పరిగేత్తారు. కొందరు ప్రాణాలు కాపాడుకునే నిమిత్తం ఫ్యాక్టరీ నుంచి క్రిందకు దూకారు. ఈ క్రమంలో ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. బర్డోలీ పోలీస్ ఎస్పీ రూపాల్ సోలంకి హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని తన సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. ఫ్టాక్టరీలో హైడ్రాలిక్ లిఫ్ట్ లో దాదాపు 100 మంది చికుకుకుని ఉన్నారని, వారిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్కున్నామని ఆయన చెప్పారు. 2019 మే నెలలో సూరత్ పరిసరాల్లో ని ఓ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ఈ ఘటన మరచి పోక ముందే మరో ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం జరిగింది.పూర్తి సమాచారం అందాల్సి ఉంది.