ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పాఠ‌శాల విద్య‌లో కొన్ని సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టింది. అందులోభాగంగా  ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఉన్న 3, 4, 5వత‌ర‌గ‌తుల‌ను ఉన్న‌త పాఠ‌శాలల ప‌రిధిలోకి తీసుకొచ్చేందుకు నిర్ణ‌యించింది. తాజాగా పాఠ‌శాల విద్యాశాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను కూడ విడుద‌ల చేసిన‌ది. ముఖ్యంగా ఈ త‌రుగ‌తుల నుంచే  విద్యార్థులకు సామ‌ర్థ్యం పెంచేందుకు ఉన్న‌త బోధ‌న అందించాల‌ని చ‌ర్య‌లు చేప‌ట్టింది ప్ర‌భుత్వం.

ఒకే ఆవ‌ర‌ణ‌లో ఉన్న లేదా దాదాపు 250 మీట‌ర్ల దూరంలో ఉన్న ప్రాథ‌మిక పాఠ‌శాలలకు సంబంధించి 3,4,5 త‌రగ‌తుల విద్యార్థుల‌ను హైస్కూళ్ల ప్ర‌ధానోపాధ్యాయుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోకి తీసుకురావాల‌ని ఆదేశించిన‌ది. అదేవిధంగా ఒక‌టి, రెండు త‌ర‌గ‌తుల విద్యార్థులు ప్రైమ‌రీ ఎస్టీజీతో బోధ‌న కొన‌సాగించి.. సీనియ‌ర్ ఎస్జీటీల‌ను 3,4,5 త‌ర‌గ‌తుల‌కు బోధించే విధంగా ఉపాధ్యాయుల‌ను స‌ర్దుబాటు చేయ‌నున్న‌ది. ప్రాథ‌మిక త‌ర‌గతిలో విద్యార్థుల‌ను 1 20 నిష్పత్తిలో ఒక టీచ‌ర్ ఉండేవిధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం అధికారుల‌కు సూచించింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: