దేశ‌వ్యాప్తంగా వాహ‌న‌దారుల‌కు పెట్రోల్ ధ‌ర‌లు ఝ‌ల‌క్ ఇస్తున్నాయి. ఇంధ‌న ధ‌ర‌లు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోలు ధ‌ర రోజు రోజుకు పెరుగుతూనే ఉన్న‌ది.  రోజు రోజుకు పెర‌గ‌డ‌మే త‌ప్పా.. త‌గ్గుద‌ల మాత్రం అస‌లు క‌నిపించ‌డం లేదు. ఈరోజు కూడ పెట్రోల్ ధ‌ర కాస్త పైకి క‌దిలింది. పెట్రోల్ తో పాటు డీజిల్ కూడ అదేబాట‌లో ప‌య‌నిస్తోంది. డీజిల్ ధ‌ర సైతం పెరిగిన‌ది.

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్రోల్ పై 35 పైస‌లు, డీజిల్‌పై 36 పైస‌లు పెరిగింది. ఈ పెరుగుద‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పెట్రోలు లీటరు ధర 114.24, లీటరు డీజిలు ధర 106.86, ప్రీమియం పెట్రోలు ధర లీటరుకు 117.70 కు చేరింది. అయితే పెట్రోల్ ధ‌ర‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమని వాహనదారులు పేర్కొంటున్నారు.  తాజాగా మరొక‌సారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో వాహనదారులు షాక్ కు గుర‌య్యారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌తో పాటు రోజు రోజుకు దేశ వ్యాప్తంగా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు, కూరగాయల ధరలు కూడా పెరగిపోతుండడంతో ప్రజలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: