విశాఖలో వరుణ్ గ్రూపు నేతృత్వాన ఇక్కడి సాగర తీరాన హోటల్ నిర్మాణానికి ఏపీ క్యాబినెట్ ఓకే చేసింది. దీనిని వరుణ్ గ్రూపు సంస్థల అధినేత ప్రభు కిశోర్ నేతృత్వంలో తాజ్ వరుణ్ పేరిట నిర్మిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన అనుమతులకు సంబం ధించి క్యాబినెట్ ఇవాళ చర్చించి ఓకే చేసింది. ఈ సందర్భంగా పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా సీఎం తీసుకున్న నిర్ణయాలపై సర్వత్రా ఆనందం వ్యక్తం అవుతోంది. ప్రకృతి అందాలతో అలరారే విశాఖ తీరానికి ఇప్పటికే ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడి ఆర్కే బీచ్, కైలాస గిరి, భీమిలి బీచ్ అన్నవి ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్నాయి. పర్యాటకుల తాకిడి కూడా గతంతో పోలిస్తే ఇప్పుడే ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొన్ని ప్రయివేటు సంస్థల తరఫున కొన్ని రిసార్టుల నిర్మాణానికి, హోటళ్ల నిర్మాణానికి ఎప్పటి నుంచో సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు తగ్గ అనుమతలపై కూడా ఎటువంటి ఆలస్యం అన్నది లేకుండా చర్యలు కూడా ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. వరుణ్ గ్రూప్ సైతం ఇక్కడి రిసార్టులు కానీ హోటళ్ల నిర్మాణానికి కానీ ఎప్పటి నుంచో ఆసక్తి చూపుతోంది. తద్వారా టూరిజం రంగాన్ని మరింత ముందుకు తీసుకుని పోయే క్రమంలో తమ భాగస్వామ్యాన్ని పెంచుకుంటోంది.