హైదరాబాద్ ఎల్బీనగర్ లో పోలీసులు భారీ ఎత్తున గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ లో పోలీసులు మొత్తం 110 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 110 కిలోల గంజాయిని ఎల్బీనగర్ ఎస్.ఓ.టి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గంజాయి ని ఏవోబీ నుంచి మహారాష్ట్ర, నాగ్‌పూర్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇక గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రంగాలను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు. ఇలా ఉంటే సీఎం కేసీఆర్ ఇటీవలే గంజాయి పై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు గంజాయిని నగరంలో లేకుండా చేసేందుకు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. గంజాయి తరలిస్తున్నట్టు అనుమానం వచ్చినా.... గంజాయి అమ్ముతున్నట్టు తెలిసినా వెంటనే దాడులు చేసి నిందితులను పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: