మెగాస్టార్ చిరంజీవి ఇటీవ‌ల బాబీ (ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వంలో 154వ సినిమా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. శ‌నివారం ఈ చిత్రానికి సంబంధించిన సినిమా షూటింగ్ ప్రారంభించారు.  ముహుర్తపు స‌న్నివేశానికి  ఐదుగురు అగ్ర‌ద‌ర్శ‌కులు హాజ‌ర‌య్యారు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కితున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

తాజాగా ముహుర్త‌పు స‌న్నివేశాన్ని ఓపెనింగ్ చేశారు. టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుడిలో ఒక‌రైన వీవీ నాయ‌క్ క్లాప్ కొట్ట‌గా.. కెమెరా స్విచ్‌ను ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథ్ ఆన్ చేశారు. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద‌ర్‌రావు మొద‌టి స‌న్నివేశానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌ర్శ‌కుడు బాబీకి  ద‌ర్శ‌కులు కొర‌టాల శివ‌, హ‌రీష్‌శంక‌ర్ లు స్క్రిప్ట్ అందించారు. అగ్ర‌ద‌ర్శ‌కులంద‌రూ క‌లిసి ఒకే సినిమా షూటింగ్‌లో పాల్గొన‌డం క‌న్నుల‌విందుగా కొన‌సాగింది. ఇందులో చిరంజీవి మాస్ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కబోతున్న  ఈ చిత్రంలో చిరు మత్యకారుడిగా కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: