ఫేస్‌బుక్ పేరు మార్చుకున్నా.. కానీ వివాదాలు మాత్రం వీడ‌డం లేదు. చికాగోకు చెందిన టెక్ సంస్థ మెటాకంపెనీ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌నున్న‌ది.  ఫేస్‌బుక్ రీబ్రాండింగ్ పేరిట త‌న పేరు అయిన మెటాను జీవన ఆధారాన్ని దొంగిలించిన‌దని ఆరోపించింది. మెటా కంపెనీ వ్య‌వ‌స్థాప‌కుడు నేట్ స్క్యూలిక్ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. ఫేస్‌బుక్ త‌న సంస్థ‌ను కొనుగోలు చేయ‌డంలో విఫ‌లం అవ్వ‌డంతో మీడియా శ‌క్తిని ఉప‌యోగించి కనుమ‌రుగు చేయాల‌ని చూస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఫేస్‌బుక్ ఎప్పుడు ఒక‌టి చెబుతుంది, మ‌రొక‌టి చేస్తుంది అని పేర్కొన్నారు.

తాను విడుద‌ల చేసిన ఈ ప్ర‌క‌ట‌న బ‌హిరంగ వివ‌ర‌ణ‌గా భావించాల‌ని స్క్యూలిక్ వెల్ల‌డించారు. మూడు నెల‌లుగా త‌మ కంపెనీని చౌక‌గా విక్ర‌యించాల‌ని ఫేస్‌బుక్‌కు సంబంధించిన లాయ‌ర్లు  వెంటాడుతున్నార‌ని వివ‌రించారు. ఫేస్‌బుక్ ఆఫ‌ర్‌ను తాము తిర‌స్క‌రించిన‌ట్టు చెప్పారు. ఇప్ప‌టికే ఫేస్‌బుక్ నియంత్ర‌ల సంస్థ‌ల త‌నిఖీలు, వినియోగ‌దారుల డేటా దుర్వినియోగం వంటి ఆరోప‌ణ‌లు వ‌స్తున్న త‌రుణంలో అక్టోబ‌ర్ 28న ఫేస్‌బుక్ పేరును మెటాగా మారుస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే.




మరింత సమాచారం తెలుసుకోండి: