గ‌త నాలుగు రోజుల నుంచి తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్న విష‌యం విధిత‌మే. ముఖ్యంగా త‌మిళ‌నాడు, కేర‌ళ‌, మ‌హే, పుదుచ్చేరి, ద‌క్షిణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల‌లో న‌వంబ‌ర్ 09, 10, 11 తేదీల‌లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.  ఈ త‌రుణంలోనే చెన్నై, తిరువ‌ళూరు, కాంఛీపురం, చెంగ‌ల్‌ప‌ట్టు జిల్లాల‌కు హై అలెర్ట్ జారీ చేశారు.

కుండ‌పోత వాన‌లు కుర‌వ‌డంతో చెన్నై న‌గ‌రం చిగురుకులా వ‌ణికిపోతుంది. న‌గ‌ర‌మంతా జ‌ల‌మ‌యంగా మారి జ‌న‌జీవ‌నం అస్థ‌వ్య‌స్తం అయింది. చెన్నై న‌గ‌రంలో వీధుల‌న్ని చెరువులు, న‌దుల్లా త‌ల‌పిస్తున్నాయి.  ఇది ఇలా ఉండ‌గానే బంగాళ‌ఖాతం స‌మీపంలో ద‌క్షిణ కోస్త ఆంధ్ర నుంచి ఉత్త‌ర త‌మిళ‌నాడు వ‌ర‌కు అల్ప‌పీడ‌న ధ్రోణి వ్యాపించి ఉన్న‌ది. దీనికి తోడుగా ఆగ్నేయ బంగాళ‌ఖాతంలో మ‌రో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం వ్యాపించిన‌ది. వీటికి తోడుగా ఉన్న అల్ప‌పీడన ప్ర‌భావంతో రానున్న 4 రోజుల పాటు రాయ‌ల‌సీమ‌, కోస్తా ఆంధ్ర ప్రాంతాల‌లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురుస్తాయి అని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ కేంద్రం తాజాగా వెల్ల‌డించింది. ఇప్ప‌టికే ఆదివారం నుంచి నెల్లూరు జిల్లాలో భారీ వ‌ర్షం ప‌డుతున్న‌ది. రాయ‌ల‌సీమ‌, కోస్తాంద్ర‌లోని ప‌లు జిల్లాల‌కు వ‌ర్షం ముప్పు ఉన్నందున మ‌త్య్స‌కారులు వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు అధికారులు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: