రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారి పై కారు బీభత్సం సృష్టించి కాసేపు అందరిని కంగారు పెట్టేసింది. డివైడర్ ను ఢీ కొట్టిన కారు లో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షత గాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు అక్కడి వాళ్ళు. అందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్ సిటీ నుండి మెహదీపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం.

పొగమంచు కారణంగా రోడ్డు కనబడక పోవడంతో అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరి ప్రాణాలకు ఇబ్బంది లేదని అంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు లో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్ గా గుర్తించారు. తమ స్నేహితుడు జైద్  ఖాన్ ను సన్ సిటీ వద్ద వదలి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: