ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవులలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతున్నది.  వారం రోజుల క్రిత‌మే పశువుల మేపేందుకు కామారం గ్రామ సమీపంలోని రాకాసి గుహల వద్దకు వెళ్ళిన ఇద్దరు పశువుల కాపర్లు, పశువులపై పెద్దపులి దాడి చేసేందుకు ప్రయత్నించిన విష‌యం విధిత‌మే. ప‌శువుల కాపరులు వెంట‌నే అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం చేర‌వేసారు. ఎప్పుడు ఎవ‌రిపై పులి దాడి చేస్తున్న‌దో ఏమోన‌ని ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. అట‌వీ శాఖ అధికారులు పులిని బంధించాల‌ని కోరుతున్నారు ప్ర‌జ‌లు.
 

ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి  మంగ‌పేట మండ‌లం మొట్ల‌గూడం, న‌ర్సింహాసాగ‌ర్ అడ‌వుల‌లో పులి సంచారం చేసిన‌ది. రైతుల‌కు చెందిన ఆవుల ప‌శువుల మంద‌పై కూడ దాడి చేసింద‌ని.. ఇప్ప‌టికే పులి సంచారాన్ని అధికారులు ధృవీక‌రించారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, గ్రామాల్లో డ‌ప్పు చ‌ప్పుడుతో ప్ర‌చారం చేస్తున్నారు. పులి సంచారముపై స్థానికులు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. ఈ స‌మ‌యంలోనే కొంద‌రు ఆక‌తాయిలు ఫేక్ వీడియోల‌ను ఇవే పులులు అంటూ వైర‌ల్ చేస్తున్నారు.  పాత వీడియోల‌ను పోస్ట్ చేయ‌డంతో మ‌రింత భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఫేక్ వీడియోల‌పై అట‌వీశాఖ అధికారులు ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డంతో మ‌రింత గోంద‌ర‌గోల ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. త్వ‌ర‌లోనే పులుల సంచారాన్ని అధికారులు ప‌రిశీలించారు. త్వ‌ర‌లోనే పులుల‌ను గ్రామాల్లోకి రాకుండా త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్టు వెల్ల‌డిస్తున్నారు అధికారులు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: