ఓ వ్యాన్‌లో ఫ‌ర్నిచ‌ర్ మాటున గంజాయిని దాచి భారీ మొత్తంలో ర‌వాణా చేస్తుండ‌గా తూర్పు గోదావ‌రి జిల్లా పోలీసులకు ప‌ట్టుబ‌డ్డారు. కాకినాడలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వివరాలను వెల్ల‌డించారు.   జిల్లాలోని చింతూరు పరిధిలో ఏఎస్పీ కృష్ణకాంత్‌ పర్యవేక్షణలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు పోలీసులు.

త‌నిఖీల‌లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వ్యాన్‌ను త‌నిఖీ చేప‌ట్ట‌గా  అందులో ఫ‌ర్నిచ‌ర్ క‌నిపించింది. వ్యాన్‌ను క్షుణ్ణంగా త‌నిఖీ నిర్వ‌హించ‌గా.. ఫ‌ర్నిచ‌ర్ అడుగు భాగంలో ఉన్న 1,500 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సుమారు దీని విలువ రూ.1.50 కోట్లు ఉంటుంద‌ని అంచెనా వేసారు. దీనిని ఒడిషాలోని మ‌ల్క‌న్‌గిరి నుంచి కూలీలు కాలిన‌డ‌క ద్వారా సుకుమామిడి ప్రాంతానికి త‌ర‌లించి అక్క‌డి నుంచి వ్యాన్‌లో ఫ‌ర్నిచ‌ర్ చాటుకు దాచి, అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న‌ట్టు గుర్తించారు పోలీసులు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌రాబాద్‌కు త‌ర‌లిస్తున్న‌ట్టు తేల్చేసారు. గౌర‌వ్‌రాణా(23), నౌశ‌ద్‌(19), ఆరిప్‌(23) నిందితుల‌ను అరెస్ట్ చేసి, గంజాయితో పాటు వ్యాన్‌, 4 మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న‌ట్టు ఎస్పీ ర‌వీంద్ర‌నాథ్ బాబు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: