సుమారు 580 ఏళ్ల త‌రువాత ఇవాళ సుదీర్ఘ పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డుతున్నది. ఈ గ్ర‌హ‌ణం దాదాపు మూడు గంట‌ల పాటు కొన‌సాగుతుంద‌ని ఖ‌గోళ నిపుణులు తెలిపారు. ఈ పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం ఈరోజు మ‌ధ్యాహ్నం 12.48 గంట‌ల‌కు మొద‌లై సాయంత్రం 4.17 గంట‌ల‌కు ముగుస్తుంద‌ని పేర్కొన్నారు. గ్ర‌హ‌ణం యొక్క వ్య‌వ‌ధి మూడు గంట‌ల 28 నిమిషాల 24 సెక‌న్ల పాటు ఉంటుంద‌ని, ఇది 580 ఏండ్ల‌లో సుదీర్ఘ‌మైన పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం అవుతుంద‌ని నిపుణులు చెప్పారు. ఈ గ్ర‌హ‌ణం 1440 ఫిబ్ర‌వ‌రి 18న చివ‌రిసారిగా ఏర్ప‌డిన‌ద‌ని, ఆ త‌రువాత 2669వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 8న ఇలాంటి గ్ర‌హ‌ణం మ‌రొక‌టి క‌నిపించనుంద‌ని వెల్ల‌డించారు.

ముఖ్యంగా ఈ పాక్షిక చంద్ర‌గ్ర‌హణంగా అమెరికా, ద‌క్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, ఫ‌సిపిక్ ప్రాంతంలో క‌నిపించ‌నున్న‌ది. భార‌త‌దేశంలోని అరుణాచల్ ప్ర‌దేశ్‌, అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చంద్రోదయం త‌రువాత తూర్పు హోరిజోన్‌కు చాలా ద‌గ్గ‌ర‌గా పాక్షిక గ్ర‌హ‌ణం, పెనుబ్ర‌ల్ గ్ర‌హ‌ణం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బిహార్‌, జార్ఖండ్‌, ప‌శ్చిమ‌బెంగాల్‌, ఒడిశాల‌లో కొద్దిగా క‌నిపించ‌నున్న‌దని వివ‌రించారు. సూప‌ర్ ప్ల‌వ‌ర్ బ్ల‌డ్ మూన్ 2021 మొద‌టి చంద్ర‌గ్ర‌హ‌ణం మే 26న సంభ‌వించింది. ఇక న‌వంబ‌ర్ 8, 2022న ఏర్ప‌డే చంద్ర‌గ్ర‌హ‌ణం భార‌త్‌లో క‌నిపిస్తుంద‌ని ఖ‌గోళ నిపుణులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: