క‌డ‌ప జిల్లాలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు సంభ‌వించ‌డంతో రాజంపేట‌లో ప్రాణ‌న‌ష్టం భారీగా జ‌రిగింది. నంద‌లూరు ప‌రివాహ‌క ప్రాంతంలో మంద‌ప‌ల్లి, ఆకేపాడు, నంద‌లూరు ప్రాంతంలో మూడు ఆర్టీసీ బ‌స్సులు వ‌ర‌ద‌నీటిలో చిక్కుకొని దాదాపు 30 మంది వ‌ర‌కు చెయ్యేరు వ‌ర‌ద ఉధృతిలో కొట్టుకుపోయిన విష‌యం విధిత‌మే. ఉద‌యం నుంచి  స‌హాయక సిబ్బంది గాలింపు చేప‌ట్టి ఇప్ప‌టివ‌ర‌కు 12 మంది మృత‌దేహాల‌ను వెలికి తీసారు. గండ్లూరు 7, రాయ‌వ‌రం 3, మండ‌ప‌ల్లిలో 2 మృత‌దేహాలు ల‌భ్యం అయ్యాయి.

రాజంపేట సమీపంలో ఉన్న‌టువంటి అన్న‌మ‌య్య జ‌లాశ‌యం మ‌ట్టిక‌ట్ట కొట్టుకుపోయిన‌ది. దీంతో ప‌రివాహ‌క ప్రాంతాల్లో వ‌ర‌ద ప్ర‌వాహం ఒక్క‌సారిగా పెరిగిపోయింది. గుండ్లూరు, పుల‌ప‌త్తూరు, శేష‌మాంబ‌పురం, మంద‌ప‌ల్లి గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. చెయ్యేరు న‌ది నుంచి పెద్ద ఎత్తున నంద‌లూరు రాంపేట ప్రాంతాల్లోకి వ‌ర‌ద నీరు పోటెత్తుతొంది. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని అధికారులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: