ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ర‌ణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఓ వైపు వ‌ర‌ద‌లు ముంచెత్తుండ‌డంతో మ‌రోవైపు నేత‌ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. వ‌రద‌ల‌తో ఎంతో మంది మృతి చెందుతున్న వేళ మ‌రోవైపు నేత‌లు అనారోగ్య ఇబ్బందుల‌తో మృత్యువాత ప‌డుతున్నారు. తాజాగా  మాజీ సైనికుడు, మ‌ద‌న‌ప‌ల్లె జ‌న‌సేన నేత, పారిశ్రామిక వేత్త హ‌చ్‌కుమార్ అనారోగ్యంతో మ‌ర‌ణించారు.

గ‌త రెండు వారాలుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ బెంగ‌ళూరులోని కొలంబియా ఏషియా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ హ‌చ్‌కుమార్ మృతి చెందారు.  ప్ర‌జారాజ్యం పార్టీ ఆవిర్భావం నుంచే మ‌ద‌న‌ప‌ల్లె ఎమ్మెల్యే అభ్య‌ర్థి కోసం హ‌చ్‌కుమార్ పోటీ ప‌డ్డారు కానీ ఆయ‌న‌కు టికెట్ ద‌క్క‌లేదు. ఆ త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ ప్రారంభంలోనే చేరారు. పారిశ్రామిక వేత్త‌గా ప‌లువురికి ఉపాధిని కూడా క‌ల్పించారు. మేము సైతం సంస్థ స‌భ్యులు రాయ‌ల బాబు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప‌ఠాన్ ఖాద‌ర్‌ఖాన్ ఆధ్వ‌ర్యంలో హ‌చ్‌కుమార్ మృత‌దేహానికి అంత్య‌క్రియ‌లు చేప‌ట్టారు. బ‌లిజ సేవా సంఘంతో పాటు ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు నివాళుల‌ర్పించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ హ‌చ్‌కుమార్ మృతి ప‌ట్ల దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేసారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: