ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడేందుకు వేదిక  అసెంబ్లీఅని.. అలాంటి అసెంబ్లీలో వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేయ‌డం బాధ‌క‌ర‌మ‌ని హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ విలేక‌ర్ల స‌మావేశంలో వెల్ల‌డించారు. నిన్న అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఎమ్మెల్యే బాల‌కృష్ణ స్పందిస్తూ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎప్పుడు కూడా కంటత‌డి పెట్ట‌లేదని వివ‌రించారు. చంద్ర‌బాబు స‌హ‌నం వ‌ల్ల‌నే మేము చాలా ఓపిక‌తో ఉన్నాం. ఇక ఓపిక న‌శించింద‌ని, చంద్ర‌బాబును కంట‌త‌డి  పెట్టించ‌డం ఆవేశం క‌లిగించింద‌న్నారు.

అంద‌రి కుటుంబాల్లో ఆడ‌వాళ్లున్నారని,  నా చెల్లెలు  భువ‌నేశ్వ‌రిపై విమ‌ర్శ‌లు చేయ‌డం బాధ‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.  స‌జావుగా సాగాల్సిన అసెంబ్లీ వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు వేదిక అయిన‌ది. మ‌నం అసెంబ్లీలో ఉన్నామా..? ప‌శువులా కొట్టంలో ఉన్నామా అని ప్ర‌శ్నించారు బాల‌కృష్ణ‌. మంచి స‌ల‌హాలు ఇచ్చినా తీసుకునే ప‌రిస్థితిలో లేదు ఏపీ ప్ర‌భుత్వం అని చెప్పారు. అసెంబ్లీలో జ‌రిగిన ప‌రిణామాలు చాలా బాధ‌క‌ర‌మ‌ని, ఎంతో ధైర్యంగా ఉండే చంద్ర‌బాబు కంట‌త‌డి పెట్టుకోవ‌డం ఎప్పుడు లేదు. అభివృద్ధి చ‌ర్చ‌కు బ‌దులు వ్య‌క‌గ‌త చ‌ర్చ‌లు అసెంబ్లీలో తీసుకొచ్చారు.  అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు వాడుతున్న భాష‌, హావ‌భావాలు దారుణంగా ఉన్నాయి. అలాంటి భాష వాడితే స‌హించేది లేద‌ని, ఇక వారి భ‌ర‌తం ప‌డ‌తాం క‌బ‌డ్దార్ అని హెచ్చ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: