ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని కేసీఆర్ మ‌రొక‌సారి ఎండగట్టారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు  కేసీఆర్‌. 700 మంది రైతుల‌ను పొట్టనపెట్టుకున్న హంతక పార్టీ బీజేపీ అని తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రాన్ని ఒప్పించే దమ్ములేక తెలంగాణ బీజేపీ నేతలు నాటకాలు ఆడుతున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని.. కేంద్ర మంత్రి ఎవ‌రైనా ఉంటే రాష్ట్రానికి లాభంగా ఉండాల‌ని పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేత‌ల‌ను ప‌ట్టించుకునే నాథుడే ఉండ‌ర‌ని వాపోయారు.

ప్ర‌పంచ ఆక‌లి సూచిక 116 దేశాల‌ను స‌ర్వే చేస్తే భార‌త్ స్థానం అందులో 101 అని.. ఈ మ‌ధ్య కాలంలో దాని గురించి హిందూ పేప‌ర్‌లో ఓ అనాల‌సిస్ ఆర్టిక‌ల్  కూడా రాశార‌ని చెప్పారు కేసీఆర్‌.  సిగ్గు ఉంటే క‌ళ్లు తెర‌వండి..  పాకిస్తాన్ 98 అయితే భార‌త్‌ది 101 అని.. అదే ప‌క్క‌న ఉన్న‌ బంగ్లాదేశ్‌, నేపాల్  ఆక‌లి సూచిక ర్యాంకుల‌లో 76 ఉన్నాయ‌ని వివ‌రించారు.  కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: