తెలుగు సినిమా గేయరచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి  పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని  తెలుగు భాషకు పట్టం కడుతూ ఆయ‌న‌ రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేను కూడా ఒకడిని అని ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు పేర్కొన్నారు.

 సీతారామశాస్త్రి  అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి కిమ్స్ వైద్యులతో ఫోన్ లో మాట్ల‌లాడాన‌ని,   వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాను అని వెల్ల‌డించారు.  త్వరలోనే కోలుకుంటారని భావిస్తున్న తరుణంలో ఈ వార్త వినాల్సిరావడం విచారకరం అని తెలిపారు.  సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య‌నాయుడు. సిరివెన్నెల మృతి చెంద‌డంతో ప‌లువురు ప్ర‌ముఖులు నివాళుల‌ర్పించ‌డంతో పాటు సంతాపం తెలుపుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: