సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ మరణం యావత్‌ దేశానికే తీరని లోటు అని మాజీ కేంద్ర రక్షణ సహాయశాఖ మంత్రి పల్లం రాజు  పేర్కొన్నారు. బిపిన్ రావత్‌ మరణం పై  ఆయ‌న స్పందిస్తూ..  నాకు సీడీఎస్ బిపిన్ రావత్‌తో మంచి అనుబంధం ఉంద‌ని.. త్రివిధ దళాల అధిపతిగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఎన్నో పతకాలు సాధించారని గుర్తు చేసారు.  చాపర్ ప్రమాదం పై అనేక ప్రచారాలు జరుగుతున్నాయని.. కానీ దర్యాప్తులోనే నిజాలు తెలుస్తాయని ఆయన వివ‌రించారు. ముఖ్యంగా విజబులిటి సరిగ్గా లేకనే చాపర్ క్రాష్ అయి ఉంటుందని అభిప్రాయ పడ్డారు పల్లం రాజు. వీఐపీల ప్రయాణంలో కొన్నిజాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని రాజు చెప్పారు.

పరిస్థితులు అనుకూలించనప్పుడు  కున్నూర్ నుండి వెల్లింగ్టన్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. రక్షణశాఖలో ప్ర‌యివేటు భాగస్వామ్యం కొంత మేరకు అవసరం అయినప్పటికీ నాణ్యత, ప్రమాణాల విషయంలో రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని పల్లం రాజు తెలిపారు. బిపిన్‌ రావత్‌ మరణం దేశానికి ఎంతో నష్టం కలిగించిన‌దని..  ముఖ్యంగా వీఐపీలు ప్రయాణాలు చేసేటప్పుడు పలు జాగ్రత్తలు పాటించాలని  సలహా ఇచ్చారు పల్లం రాజు.



మరింత సమాచారం తెలుసుకోండి: